పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది విద్యార్థులకు కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. నిత్యం వందలాది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరోవైపు శీతాకాలంలో సెకండ్‌ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది విద్యార్థులకు కరోనా
Follow us

|

Updated on: Nov 04, 2020 | 4:17 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. నిత్యం వందలాది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరోవైపు శీతాకాలంలో సెకండ్‌ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఇంతకాలం మూసివేసిన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 8 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచుతూ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన పిల్లలు కొవిడ్ బారిన పడటంతో కంగారుపడుతున్నారు. మరోవైపు, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ బడులు నిర్వహిస్తామని విద్యాధికారులు ప్రకటిస్తున్నారు.