ఏపీలో ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసులు..మరణాల సంఖ్య?

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. ఎపిలో కొత్త‌గా గురువారం ఒక్క రోజులోనే..

ఏపీలో ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసులు..మరణాల సంఖ్య?
Follow us

|

Updated on: Jul 02, 2020 | 2:35 PM

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. ఎపిలో కొత్త‌గా గురువారం(జూలై2న) 845 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నేడు 14,285 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 845 మందికి కరోనా నిర్ధారణ అయింది. వాటిలో ఎపీలోని 13 జిల్లాలకు చెందిన వారు 812 మంది ఉండగా, వ‌ల‌స కూలీలు 29 మంది, విదేశాల నుంచి వచ్చిన న‌లుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎపీలో మార్చి తొమ్మిదో తేది నుంచి నేటి వరకు మొత్తం 16 వేల 097 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇప్పటివరకు 5 వేల 868 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 1324 మంది, ఎన్ఆర్ఐలు 121 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ప్ర‌స్తుతం జిల్లాల్లో 7559 యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 286 మంది, వ‌ల‌స కూలీలు 7416 మంది వివిద హాస్ప‌ట‌ల్స్ లో చికిత్స పొందు‌తున్నారు. కాగా నేడు క‌రోనాతో అయిదుగురు మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 198 కి పెరిగింది. నేడు శ్రీకాకుళంలో, అనంత‌పురంలో, గుంటూరులో, క‌ర్నూలులో , కృష్ణా జిల్లాల‌లో ఒక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు.