ఏపీలో క‌రోనా విల‌యం..రికార్డు స్థాయిలో 81 కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌డ‌లెత్తిపోతోంది.  రాష్ట్రంలో కరోనా మహమ్మా రి కోరలు చాస్తోంది. ఏమాత్రం అడ్డూ అదుపులేకుండా కోవిడ్ భూతం విరుచుకుప‌డుతోంది. తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81 కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,097కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కేసులు నమోద య్యాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. జిల్లాలోనే అత్య‌ధిక కేసులు విజ‌య‌వాడ‌లోనే న‌మోదుకావ‌టంతో .. విజయవాడలో పరిస్థితులు […]

ఏపీలో క‌రోనా విల‌యం..రికార్డు స్థాయిలో 81 కేసులు
Follow us

|

Updated on: Apr 27, 2020 | 7:35 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌డ‌లెత్తిపోతోంది.  రాష్ట్రంలో కరోనా మహమ్మా రి కోరలు చాస్తోంది. ఏమాత్రం అడ్డూ అదుపులేకుండా కోవిడ్ భూతం విరుచుకుప‌డుతోంది. తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81 కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,097కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కేసులు నమోద య్యాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. జిల్లాలోనే అత్య‌ధిక కేసులు విజ‌య‌వాడ‌లోనే న‌మోదుకావ‌టంతో .. విజయవాడలో పరిస్థితులు చేయిదాటిపోయే ప్ర‌మాదం ఉందంటూ స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
ఇక‌, అనంతపురంలో 2, పశ్చిమ గోదావరిలో 12, ప్రకాశంలో 3, కర్నూలు లో 4, కడపలో 3, గుంటూరులో 3, తూర్పుగోదావరిలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 6,768 నమూనాలను పరీక్షించారు. వీటిలో 81 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. మరోవై పు గత 24 గంటల్లో 60 మంది కోవిడ్‌ బాధితులు కోలుకుని, హాస్పటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప టి వరకు కోలుకున్న వారి సంఖ్య 231కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 31 మంది కోవిడ్ బారిన ప‌డి మరణించారు. ప్రస్తుతం 835 మంది కరోనా బాధితులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.