Breaking News
  • తెలంగాణ లో 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం. అత్యధికంగా కొమురం భీం జిల్లా బెజ్జూర్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం. కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ లో 8.4 సెంటీమీటర్లు. నాగర్కర్నూల్, కరీంనగర్, ములుగు, జనగాం జిల్లాలో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు. వరంగల్ అర్బన్, రూరల్, సిద్దిపేట్ ,భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో 3 సెంటీమీటర్లు. నగరంలో లో చార్మినార్ ,ఆసిఫ్ నగర్, బహుదూర్ పుర , సరూర్ నగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్,నాంపల్లి ఏరియాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం.
  • విజయవాడ: రమేష్ హాస్పిటల్ ఎం.డి వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసిపి సూర్యచంద్రరావు . రమేష్ హాస్పిటల్ ఎం.డి రమేష్ బాబు ఇంకా పరారీ లోనే ఉన్నాడు. ఇల్లు, ఆఫీసు లో సోదాలు నిర్వహించాం. రమేష్ బాబు పోలీసుల ముందుకు వచ్చి ఎలాంటి అనుమతి తీసుకున్నారో చూపిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తాం. సాక్షులు అందరినీ విచారిస్తున్న ముద్దాయిల కోసం గాలిస్తున్నాం. స్వర్ణ ప్యాలెస్ లో ఉన్నది రమేష్ హాస్పిటల్ పేషెంట్స్ కాబట్టి రమేష్ హాస్పిటల్ మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. డాక్టర్ మమతా దగ్గర కూడా మాకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నాం
  • ధవళేశ్వరం బ్యారేజీ: ధవళేశ్వరం బ్యారేజి దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, నీళ్లను నేరుగా సముద్రంలోకి వదుల్తున్నారు. వచ్చే 2 రోజుల్లో వరద 10 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. భద్రాచలం నుంచి పోలవరం డ్యాం సైట్ వరకు గోదావరి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
  • ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం. అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం. స్థానిక జోడిమెట్ల లోని క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ.
  • స్వర్ణ పేలస్ ఫైర్ యాక్సిడెంట్ అగ్నిప్రమాదం పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెసిన హీరో రామ్. రమేశ్ హాస్పిటల్ ఎండీ రమేశ్ కు అన్న కొడుకు హీరో రామ్. పెద్ద కుట్ర జరుగుతోంది.. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలీకుండా చేసే పనులు వాళ్ళమీ రివ్యూటేషన కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోంది. స్వర్ణ పేలస్ ని రమేష్ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోకముందే దాన్ని ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా వినియోగించింది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఎవర్నీ నిందించేవాళ్ళు..హీరో రామ్.
  • విజయవాడ: ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు ,వంకలు . ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తుతున్న వరద . వరద పరిస్థితి ని సమీక్షించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. 70 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నాం. తాగు, సాగు నీరు కోసం 10,000 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసాం. ఈ రోజు రాత్రి కి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావచ్చని అంచనా వేస్తున్నాం. అప్రమత్తంగా ఉండాలని నదీపరీవాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసాం.
  • జడ్జి ముందుకు కీసర తహశీల్దార్‌ నాగరాజు తహశీల్దార్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన ఏసీబీ స్పెషల్‌ జడ్జి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నాగరాజు-ఏసీబీ డీజీ కీసర మండలం రాంపల్లి గ్రామ భూవివాదంలో రూ.2 కోట్లు డిమాండ్‌ శ్రీనాధ్‌యాదవ్‌కు చెందిన శ్రీ సత్య డెవలపర్స్‌ 19.39 ఎకరాల భూమి భూ వివాదంలో అనుకూలంగా వ్యవహరించేందుకు తహశీల్దార్‌ డీల్‌-ఏసీబీ డీజీ కీసర తహశీల్దార్‌ నాగరాజు ఇంట్లో సోదాలు, రూ.36 లక్షల నగదు స్వాధీనం తహశీల్దార్‌ నాగరాజు ఇంట్లో అరకిలో బంగారం స్వాధీనం, లాకర్‌ గుర్తింపు తహశీల్దార్‌ నాగరాజు, శ్రీనాధ్‌ యాదవ్‌, అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయినాధ్‌ అరెస్ట్‌ వైద్య పరీక్షల అనంతరం జడ్జిముందు హాజరు-ఏసీబీ డైరెక్టర్‌ జనరల్

Corona World: వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.68 లక్షలు…

ప్రపంచవ్యాప్తంగా 12,874,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,325 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,503,118 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Coronavirus Cases In World, Corona World: వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.68 లక్షలు…

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,874,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,325 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,503,118 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 4996 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(3,357,130), మరణాలు(137,418) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 1,840,812 నమోదు కాగా, మృతుల సంఖ్య 71,492కు చేరింది. ఇక రష్యాలో 727,162 పాజిటివ్ కేసులు, 11,335 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 854,480 నమోదు కాగా, మృతుల సంఖ్య 22,718కి చేరింది.

Also Read:

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

Related Tags