కరోనా: ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. తెలంగాణలో తగ్గుముఖం.!

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 1608 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే 762 నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డిలో 171, మేడ్చల్ లో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కు చేరింది. నిన్న […]

కరోనా: ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. తెలంగాణలో తగ్గుముఖం.!
Follow us

|

Updated on: Jul 11, 2020 | 7:52 AM

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 1608 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే 762 నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డిలో 171, మేడ్చల్ లో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కు చేరింది. నిన్న ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. అలాగే 1,013 మంది మంది కూడా కోలుకున్నారు. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 19,205కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. అటు 12,680 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. శుక్రవారం కొత్తగా 1608 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 292కి చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం(2850), కర్నూలు(2939), గుంటూరు(2799), తూర్పుగోదావరి(2231)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా.. కర్నూలు(93), కృష్ణ(75)లలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13 నుంచి వీడియో పాఠాలు..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..