Breaking News
  • భారీ వర్ష సూచన : హైదరాబాద్‌: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు . బలపడిన తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న అల్పపీడనం . దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . బంగాళాఖాతంలో ఈనెల 20న ఏర్పడనున్న మరో అల్పపీడనం . ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు వర్షాలు . కృష్ణా, గుంటూరు, కర్నూలు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు. -హైదరాబాద్‌ వాతావరణశాఖ సీనియర్‌ అధికారి రాజారావు .
  • పోటెత్తిన వరద . విజయవాడ: నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద ఉధృతి . సాగర్‌ 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల . గేట్లు ఎత్తడంతో ప్రాంతాల్లోకి పోటెత్తిన వరదనీరు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలో వరద ప్రవాహం . బిక్కుబిక్కుమంటున్న చేపలకాలనీ వాసులు .
  • త్వరలో క్షిపణి ప్రయోగం . దక్షిణకొరియా: క్షిపణి ప్రయోగాల్లో సైన్యం మరింత దూకుడు . జలాంతర్గముల ద్వారా త్వరలోనే బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం . ప్రకటించిన దక్షిణకొరియా సైన్యం . ఏడాదిలోపే ఈ ప్రయోగం ఉంటుందని ప్రకటన . అమెరికాతో అణ్వాయుధ చర్చలు నిలిచిన క్రమంలో దూకుడు.
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 13,351 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 4,432 మంది భక్తులు. రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి ఆలయంలో.. ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న గరుడ వాహన సేవ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌.
  • నేడు మోదీ బర్త్‌డే : ఢిల్లీ: ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు . ప్రపంచవ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షల వెల్లువ . మోదీ నాయకత్వంలో భారత్‌-ఫిన్లాండ్‌ మధ్య సంబంధాలు.. మరింత బలపడాలని ఆకాంక్షించిన ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ . మోదీకి పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌బేడీ, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరారాజే శుభాకాంక్షలు .
  • డ్రాగన్‌ నిఘాపై దర్యాప్తు: ఢిల్లీ: చైనా డిజిటల్‌ గూఢచర్యంపై దర్యాప్తుకు భారత ప్రభుత్వం సిద్ధం . భారతీయులపై చైనా డిజిటల్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం . దర్యాప్తు చేపట్టేందుకు జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ నేతృత్వంలో కమిటీ . 10వేలమంది భారతీయులపై డిజిటల్‌ నిఘా పెట్టిందంటూ ఆరోపణలు . ఈ జాబితాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ సహా.. అనేక మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం . చైనాకు చెందిన సమాచార సాంకేతిక కంపెనీ జెన్‌హువాపై దర్యాప్తుకు సిద్ధం . ఈ కంపెనీకి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలున్నాయంటూ సమాచారం.

దేశంలో కరోనా: 97,893 పాజిటివ్ కేసులు, 1,132 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,132 మరణాలు సంభవించాయి.
Coronavirus Positive Cases India, దేశంలో కరోనా: 97,893 పాజిటివ్ కేసులు, 1,132 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,132 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 51,18,253కి చేరుకుంది. ఇందులో 10,09,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 83,198 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 40.25 లక్షల మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (Coronavirus Positive Cases India)

ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 23,365 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ 11,21,221 కరోనా కేసులు ఉండగా.. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువ అవుతోంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63 శాతంగా ఉంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

Related Tags