Breaking News
  • హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు. హైదరాబాద్‌-కర్నూలు హైవేపై వరద ప్రవాహం. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వెళ్లే వాహనాలు ఓఆర్‌ఆర్‌ మీదుగా మళ్లింపు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలీచౌకీ ఫ్లైఓవర్ వాడొద్దు. సెవెన్‌ టూంబ్స్‌ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసుల సూచన. పురానాపూల్‌ 100 ఫీట్‌ రోడ్డు మూసివేత, కార్వాన్‌ మీదుగా మళ్లింపు. ముసారాం బాగ్‌ బ్రిడ్జి దగ్గర స్తంభించిన ట్రాఫిక్. మలక్‌పేట-ఎల్బీనగర్‌ మార్గంలో రాకపోకలకు అంతరాయం.
  • తిరుమల: ముగిసిన షోడశదిన సుందరకాండ దీక్ష. 16 రోజులపాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం నిర్వహణ. మహా సంకల్పంతో దీక్ష చేపట్టిన.. అదనపు ఈవో ధర్మారెడ్డిని అభినందిస్తున్నాం. విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు. దేవదేవుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి అంతమవుతుందని భావిస్తున్నాం. -టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి.
  • హైదరాబాద్‌: మైలార్‌దేవ్‌పల్లి పల్లె చెరువుకు గండి. చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి వరద ప్రవాహం. ఏ క్షణమైనా చెరువుకట్ట ధ్వంసమయ్యే అవకాశం. దిగువ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్మీ అధికారులు. అల్‌ జుబేల్‌ కాలనీ, అలీనగర్‌, గాజీ మిలన్‌ కాలనీ, నిమ్రా కాలనీ.. ఉప్పుగూడ, లలితా బాగ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం.
  • అమరావతి: భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష. పాల్గొన్న హోంమంత్రి సుచరిత, మంత్రి బొత్స, సీఎస్‌ నీలం సాహ్ని. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేయాలి. రోడ్ల పునరుద్ధరణ కూడా అంతే వేగంగా చేపట్టాలి. వర్షాలతో వచ్చే వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలి. పునరావాస శిబిరాల్లో అవసరమైన సాయం అందించాలి. తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి పెట్టాలి-సీఎం జగన్‌.
  • అమరావతి: స్కూళ్లు తెరిచేందుకు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే పాఠశాలలు తెరుస్తాం. నవంబర్‌ 2 నుంచి స్కూల్స్ ప్రారంభించే యోచన-మంత్రి ఆదిమూలపు. ట్యూషన్లకు వెళ్లిన పిల్లలకు కరోనా సోకడం దురదృష్టకరం. స్కూల్స్‌లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు. ఇప్పటికే 70 శాతం నాడు-నేడు పనులు పూర్తయ్యాయి. కరోనా కారణంగా నాడు-నేడు పనుల్లో కొంత జాప్యం. రాష్ట్రంలో ప్రైవేట్‌ స్కూల్స్‌ కూడా అవసరమే-మంత్రి సురేష్‌. అనేక మంది ప్రభుత్వ స్కూల్స్‌లో చేరుతున్నారు. అన్‌లాక్‌-6 కోసం వేచి చూస్తున్నాం-మంత్రి ఆదిమూలపు సురేష్‌.
  • జనగామ దగ్గర రోడ్డు ప్రమాదం. బ్రిడ్జి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 3,892 పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కి చేరింది.

Coronavirus Positive Cases, ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 3,892 పాజిటివ్ కేసులు..

Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 69,463 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఇందులో 41,669 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,19,477 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 28 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,319కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 67.72 లక్షల కరోనా టెస్టులు జరిగాయి. ఇక నిన్న 5,050 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 290, చిత్తూరు 405, తూర్పుగోదావరి 607, గుంటూరు 345, కడప 332, కృష్ణా 458, కర్నూలు 104, నెల్లూరు 219, ప్రకాశం 146, శ్రీకాకుళం 154, విశాఖపట్నం 163, విజయనగరం 151, పశ్చిమ గోదావరి 518 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,888కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 718 మంది కరోనాతో మరణించారు.

Related Tags