కరోనాపై యుద్ధం.. మీరూ భాగస్వాములు కండి..

Coronavirus: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం కరోనా వైరస్‌పై యుద్ధభేరి సాగిస్తోంది. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి బడా వ్యాపారవేత్తలు ఎందరో మేము సైతం అంటూ ముందుకొచ్చి భారీ విరాళాలను ప్రకటించారు. ఇక ఈ యుద్ధంలో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించే వారి కోసం అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీఎం-కేర్స్‌ (ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ […]

కరోనాపై యుద్ధం.. మీరూ భాగస్వాములు కండి..
Follow us

|

Updated on: Mar 29, 2020 | 11:13 AM

Coronavirus: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం కరోనా వైరస్‌పై యుద్ధభేరి సాగిస్తోంది. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి బడా వ్యాపారవేత్తలు ఎందరో మేము సైతం అంటూ ముందుకొచ్చి భారీ విరాళాలను ప్రకటించారు. ఇక ఈ యుద్ధంలో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించే వారి కోసం అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీఎం-కేర్స్‌ (ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌) ఫండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రకటించారు.

కోవిడ్ 19ను నివారించేందుకు భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్దానికి తాము కూడా సహకరిస్తామని.. విరాళాలను అందజేస్తామని అన్ని వర్గాల ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘దేశ పౌరులందరూ పీఎం- కేర్స్ నిధికి విరాళాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా మనల్ని ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని’ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పౌరులు www.pmindia.gov.inను సందర్శించి పీఎం-కేర్స్‌ అనే బటన్‌ క్లిక్ చేసి విరాళాలు అందజేయవచ్చు…

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…