గాల్లోనూ కరోనా వైరస్ కణాలు.. శాస్త్రజ్ఞుల ఆందోళన

ఇన్నాళ్లూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా వైరస్ కి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. గాలిలో సైతం ఈ వైరస్ అతి చిన్న కణాల   రూపంలో..

గాల్లోనూ కరోనా వైరస్ కణాలు.. శాస్త్రజ్ఞుల ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 11:41 AM

ఇన్నాళ్లూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా వైరస్ కి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. గాలిలో సైతం ఈ వైరస్ అతి చిన్న కణాల   రూపంలో ఉంటుందని, అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గైడ్ లైన్స్ లేదా సిఫారసులను మార్చాలని పలువురు శాస్త్రజ్ఞులు కోరుతున్నారు. ఈ మేరకు వారీ  సంస్థకు ఓ లేఖను రాశారు. మనిషి తుమ్మినప్పుడో , దగ్గినప్పుడో వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని అనుకుంటూ వచ్చాం .. కానీ ఇప్పుడు గాలి కూడా దీనికి అతీతమైనదేమీ కాదని తెలుస్తోంది అని వీరు పేర్కొన్నారు. 32 దేశాలకు చెందిన సుమారు 239 మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల గురించిన సమాచారాన్ని వచ్ఛేవారం ఓ మెడికల్ జర్నల్ లో ప్రచురించనున్నారు. అయితే వీరి లేఖపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా స్పందించలేదు. కాగా..గాల్లో ఈ వైరస్ కణాలు ఉంటాయన్న విషయాన్ని గత రెండు నెలలుగా తాము పరిశీలిస్తున్నామని, కానీ స్పష్టమైన ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలో టెక్నీకల్ విభాగానికి చెందిన డాక్టర్ బెనిడిట్టో పేర్కొన్నారు.

పరిశోధకుల బృందం తమ తాజా రీసెర్చ్ గురించి ఎప్పుడెప్పుడు సదరు జర్నల్ లో ప్రచురిస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు తామర తంపరగా పెరుగుతూ అనేక దేశాలను వణికిస్తున్నాయి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..