‘కరోనా వైరస్‌’ గురించి తప్పుడు ప్రచారం.. మోహన్‌లాల్‌పై కేసు..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన పెరుగుతోంది. ఈ వైరస్‌ను నివారించేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కొత్త వైరస్ కావడం.. ఇంకా మందును కనుగొనకపోవడం..

'కరోనా వైరస్‌' గురించి తప్పుడు ప్రచారం.. మోహన్‌లాల్‌పై కేసు..?
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 4:32 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన పెరుగుతోంది. ఈ వైరస్‌ను నివారించేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కొత్త వైరస్ కావడం.. ఇంకా మందును కనుగొనకపోవడం.. వైరస్ విస్తరణ వేగంగా ఉండటంతో.. ఈ మహమ్మారి గురించి రోజురోజుకు భయం పెరుగుతోంది. కాగా కరోనా వైరస్‌ గురించి మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోహన్‌లాల్‌.. అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్‌ చనిపోయే అవకాశం ఉంది. చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వలన బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోయే అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టి అందరం వైరస్‌ను నియంత్రిద్దాం అని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారగా.. దీనిపై ట్రోల్స్‌ కూడా భారీగా వచ్చాయి.

ఈ నేపథ్యంలో శ్రీను అనే వ్యక్తి కేరళ మానవ హక్కుల కమిషన్‌లో మోహన్‌లాల్‌పై ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోహన్‌ లాల్ ఇలా ప్రచారం చేయడం సరికాదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ వ్యక్తి తెలిపారు. అంతేకాదు మోహన్‌ లాల్‌పై ఫిర్యాదు చేసిన కాపీని కూడా షేర్ చేశారు. ఓ స్టార్ నటుడు తన స్టార్‌డమ్‌ను బాధ్యతగా ఉపయోగించుకోవాలని శ్రీను సూచించారు. ఇక ఈ ఫిర్యాదు కాస్త వైరల్‌గా మారగా.. పలువురు నెటిజన్లు మానవ హక్కుల కమిషన్‌ను ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కేరళ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆయనపై ఇంకా కేసును నమోదు చేయలేదని.. శ్రీను ఇచ్చిన ఫిర్యాదును ఇంకా పరిశీలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్‌’లో ఆ తమిళ స్టార్ హీరో..? అదే నిజమైతేనా..!