Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత. నిమ్మగడ్డ రమేశ్ ను ఈసీ గా కొనదగించాలని. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికయినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో కక్ష సాధింపు రాజకీయాలా.

వేడి వేడి సమోసా కావాలంటూ హెల్ప్‌లైన్‌కు కాల్‌.. అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Coronavirus Outbreak, వేడి వేడి సమోసా కావాలంటూ హెల్ప్‌లైన్‌కు కాల్‌.. అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Coronavirus Outbreak: దేశంలో కోవిడ్ 19 ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి.

ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న మోదీ సర్కార్.. అత్యవసర సేవలు మినహాయించి.. అన్నింటిని కూడా మూసేసింది. ఈ క్రమంలోనే జనాలకు మందుల పంపిణీ, అత్యవసర వస్తువులను అందించడం, పలు సదుపాయాల కోసం ప్రభుత్వాలు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. అత్యవసర సేవల కోసం ఉన్న ఈ హెల్ప్‌లైన్‌కు కొందరు ఆకతాయిలు ఫోన్ చేసి సిబ్బందిని విసిగిస్తున్నారు.

ఓ ఆకతాయి ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి నాలుగు వేడి వేడి సమోసాలు కావాలని అడిగాడు. అంతకముందు కూడా ఇదే వ్యక్తి పిజ్జాలు కోరగా.. చిర్రెత్తుకొచ్చిన అధికారి, ఆ వ్యక్తితో డ్రైనేజీలు శుభ్రం చేయించి సరైన బుద్ధి చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. కాగా, కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ సిబ్బంది బాధితులు, ప్రజలకు సేవలు చేస్తున్న సంగతి విదితమే.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

Coronavirus Outbreak, వేడి వేడి సమోసా కావాలంటూ హెల్ప్‌లైన్‌కు కాల్‌.. అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Related Tags