మోదీ ఇలాకాలో.. లేడి డాక్టర్‌పై ఇంటి ఓనర్ దౌర్జన్యం..

Coronavirus Outbreak: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో వైద్యులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్ 19 సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోలేని కొంతమంది వ్యక్తులు వారిపైనే విరుచుకుపడుతున్న వైనం పలు చోట్ల చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే వైద్యులకు సరైన రక్షణ కల్పించాలంటూ మోదీ సర్కార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే వాటిని కూడా బేఖాతర్ చేస్తూ ప్రధాని […]

మోదీ ఇలాకాలో.. లేడి డాక్టర్‌పై ఇంటి ఓనర్ దౌర్జన్యం..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 12:58 PM

Coronavirus Outbreak: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో వైద్యులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్ 19 సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోలేని కొంతమంది వ్యక్తులు వారిపైనే విరుచుకుపడుతున్న వైనం పలు చోట్ల చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే వైద్యులకు సరైన రక్షణ కల్పించాలంటూ మోదీ సర్కార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే వాటిని కూడా బేఖాతర్ చేస్తూ ప్రధాని సొంత ఇలాకా అయిన గుజరాత్‌లో లేడి డాక్టర్‌పై ఓ ఇంటి ఓనర్ విరుచుకుపడ్డాడు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని సూరత్ సివిల్ హాస్పిటల్‌లో ఓ లేడి డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నివాసముంటున్న ఇంటి ఓనర్ ఈమెపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆమె వల్ల తమకు కూడా కరోనా సోకుతుందని.. తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలనీ రెచ్చిపోయాడు. ఇక ఈ తతంగాన్ని మొత్తం ఆ లేడి డాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది.

మరోవైపు ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ నేత శ్రీవత్స.. ట్విట్టర్ వేదికగా ఇంటి ఓనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కోరారు. పైగా మోదీ సొంత రాష్ట్రంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు తక్షణమే అలెర్ట్ అయ్యి ఆ ఇంటి ఓనర్, ఆయన భార్యను అరెస్ట్ చేశారు. పోలీసులు వారి స్టైల్‌లో కోటింగ్ ఇవ్వడంతో అతడు లేడి డాక్టర్‌కు క్షమాపణలు చెప్పడం జరిగింది. తమకు ఆమె ఇంట్లో నివాసం ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదని.. కేవలం కరోనాపై భయంతోనే ఇలా జరిగిందని అతడు రాసిచ్చిన క్షమాపణ పత్రంలో పేర్కొన్నాడు.

ఇది చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..