కరోనా ఎఫెక్ట్‌: చైనా ఉత్పత్తుల నిషేధం.. అంతర్జాతీయ వాణిజ్య మార్గం మూసివేత!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా, మియన్మార్‌ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆహారం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై మణిపూర్‌, మిజోరం రాష్ట్రాలు నిషేధం విధించాయి. నిబంధనల ప్రకారం ప్యాక్‌ చేయని, లేబుల్స్‌ లేని ఆహార పదార్థాలు… ఇతర అన్ని ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక నిషేధాన్ని విధించినట్టు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. మణిపూర్‌ సరిహద్దుల వెంబడి ఉన్న మార్కెట్లలో చైనాకు చెందిన ఆహార […]

కరోనా ఎఫెక్ట్‌: చైనా ఉత్పత్తుల నిషేధం.. అంతర్జాతీయ వాణిజ్య మార్గం మూసివేత!
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 3:37 PM

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా, మియన్మార్‌ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆహారం, ఇతర ఉత్పత్తుల దిగుమతులపై మణిపూర్‌, మిజోరం రాష్ట్రాలు నిషేధం విధించాయి. నిబంధనల ప్రకారం ప్యాక్‌ చేయని, లేబుల్స్‌ లేని ఆహార పదార్థాలు… ఇతర అన్ని ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక నిషేధాన్ని విధించినట్టు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. మణిపూర్‌ సరిహద్దుల వెంబడి ఉన్న మార్కెట్లలో చైనాకు చెందిన ఆహార పదార్థాలతో పాటు సెకెండ్‌ హ్యాండ్‌ వస్త్రాలు వంటి ఉత్పత్తులను కొనవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. మియన్మార్‌కు దారితీసే మణిపూర్ సరిహద్దు ప్రాంతమైన ఉఖ్రుల్‌ జిల్లాలోని రెండు గ్రామాల వెంబడి ఉన్న అంతర్జాతీయ వాణిజ్య మార్గాన్ని ఫిబ్రవరి 9 నుంచి మూసివేయనున్నారు. నాలుగు భారతీయ రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అసోంలు 1880 కిలో మీటర్ల మేరకు బంగ్లాదేశ్‌తో… మిజోరం, మణిపూర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మియన్మార్‌తో 1640 కిలోమీటర్ల అరక్షిత సరిహద్దులను కలిగి ఉన్నాయి. కాగా మియన్మార్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి భారత ప్రభుత్వం కరోనా పరీక్షా కేంద్రాలను నెలకొల్పింది.