Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. హైదరాబాద్ హై-అలెర్ట్!

Coronavirus Outbreak, కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. హైదరాబాద్ హై-అలెర్ట్!

ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని ఉహాన్ నగరంలో మొదటిసారిగా ఈ వైరస్‌ను కనిపెట్టగా.. ఇప్పుడు ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా మారి.. అన్ని చోట్లకు వేగంగా పాకుతుండటంతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఇకపోతే కేరళకు చెందిన ఓ నర్సుకు ఈ వైరస్ సోకిందని వార్తలు వస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.

దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. చైనా, హాంగ్‌‌‌‌‌కాంగ్ నుంచి వచ్చే ప్రయాణీకులను పరీక్షించడానికి ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా హొంగ్‌కాంగ్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి విమాన రాకపోకలు లేవు. అయితే ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత హొంగ్‌కాంగ్ నుంచి ఓ విమానం వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. విమానాశ్రయంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే తక్షణం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

  1. ఎప్పటికప్పుడు చేతులను సబ్బులతో కడుక్కోవాలి
  2. చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు
  3. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోండి
  4. పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి

 

Related Tags