సింగపూర్‌లో ‘ఆరెంజ్‌’ అలర్ట్‌: కొనుగోళ్ల తాకిడి.. మార్కెట్లు ఖాళీ..

మహమ్మారి కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. దీంతో సింగపూర్‌లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. అక్కడ ఇప్పటికే 33 కరోనా కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ‘ఆరెంజ్‌’ హెచ్చరికను జారీ చేసింది. దాంతో నగరంలోని మార్కెట్లన్నీ అమ్మకాలతో కిటకిటలాడాయి. మొహానికి మాస్కులు ధరించిన వేలాది మంది నిత్యావసరాలు కొనేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు. విపరీతమైన కొనుగోళ్ల నేపథ్యంలో.. మార్కెట్లన్నీ జనంతో నిండిపోయాయి. అన్ని సూపర్‌ మార్కెట్లు, నిత్యవసర […]

సింగపూర్‌లో ‘ఆరెంజ్‌’ అలర్ట్‌: కొనుగోళ్ల తాకిడి.. మార్కెట్లు ఖాళీ..
Follow us

| Edited By: Umakanth Rao

Updated on: Feb 10, 2020 | 2:39 PM

మహమ్మారి కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. దీంతో సింగపూర్‌లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. అక్కడ ఇప్పటికే 33 కరోనా కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ‘ఆరెంజ్‌’ హెచ్చరికను జారీ చేసింది. దాంతో నగరంలోని మార్కెట్లన్నీ అమ్మకాలతో కిటకిటలాడాయి. మొహానికి మాస్కులు ధరించిన వేలాది మంది నిత్యావసరాలు కొనేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు. విపరీతమైన కొనుగోళ్ల నేపథ్యంలో.. మార్కెట్లన్నీ జనంతో నిండిపోయాయి. అన్ని సూపర్‌ మార్కెట్లు, నిత్యవసర సరుకుల దుకాణాలు ఖాళీ అయ్యాయి. శుక్రవారం మొదలైన కొనగోళ్ల తాకిడి శనివారం కూడా కొనసాగుతోంది.

వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. 2003లో 26 దేశాలను వణికించిన ‘సార్స్‌’ ఉపద్రవం మాదిరిగానే కరోనా కూడా ప్రబలే అవకాశం ఉందన్న ప్రభుత్వ హెచ్చరికలతో.. మార్కెట్లకు పరుగులు పెట్టామని ప్రజలు చెప్తున్నారు. ‘కరోనా మా దేశంలో మరింత విజృంభిస్తే హెల్త్‌ ఎమర్జెన్సీలో భాగంగా ‘రెడ్‌’ అలర్ట్‌ జారీ చేస్తారు. అప్పడు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆకలితో చావాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా బియ్యం, నూడుల్స్ వంటి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నాం’అని ఓ మహిళ పేర్కొన్నారు.