కరోనా అంటించిందని ప్రియురాలిని చంపేసిన యువకుడు

కరోనా వైరస్.. ఓ చూడచక్కని ప్రేమజంట కథను విషాదమయం చేసింది. తనకు కరోనా అంటిందని అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా..

  • Tv9 Telugu
  • Publish Date - 2:40 pm, Thu, 2 April 20

కరోనా వైరస్.. ఓ చూడచక్కని ప్రేమజంట కథను విషాదమయం చేసింది. తనకు కరోనా అంటిందని అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లారెనా డాక్టర్ కాగా.. ఆంటోనియా మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ‘నీ సేవలు అద్భుతం చెలీ’ అంటూ గతవారం ప్రియురాలిని పొగిడాడు ఆంటోనియా. కానీ ఆ తర్వాత స్వల్పంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు.

ఇంచుమించు కరోనా లక్షణాలే కనిపించడంతో.. లారెన్ వల్లనే అని అనుమానం పెంచుకున్నాడు. ఆమె ద్వారానే తనకు కరోనా సోకిందని భావించి.. బుధవారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. లారెన్, ఆంటోనియాల్లో ఎవరికీ కరోనా లేని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

కాగా.. చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, యూరప్, అమెరికా వంటి దేశాల్లో పంజా విసురుతోంది. అందులోనూ కరోనా వైరస్‌ కారణంగా ఇటలీ అతలాకుతలంగా ఉంది. దీని ధాటికి ఇటలీలో ఏకంగా 1,10,574 మందికి కరోనా సోకగా.. 13,155 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి: 

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం

ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే

లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం

కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ