కరోనాను జయించిన ప్రధాని భార్య..!

కరోనా మహమ్మారి బారిన పడిన కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16 రోజుల చికిత్స తరువాత గ్రెగొరీ కోలుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:00 pm, Sun, 29 March 20
కరోనాను జయించిన ప్రధాని భార్య..!

కరోనా మహమ్మారి బారిన పడిన కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16 రోజుల చికిత్స తరువాత గ్రెగొరీ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్ల‌డించారు.  కాగా మార్చి 12న లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజ‌రైన సోఫీ.. అక్కడి నుంచి వచ్చిన తరువాత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో క్వారంటైన్ క్వారంటైన్‌కు వెళ్లగా.. వైద్యులు ఆమెకు తగినంత చికిత్స అందించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన సోఫీ.. ప్రస్తుతం నా ఆరోగ్యం బావుంది. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెబుతున్నా. వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని.. మనందరం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని సూచించారు.

Read This Story Also: సింగర్‌కు నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో ఫ్యామిలీ..!

https://www.facebook.com/SophieGregoireTrudeau/posts/2473142892938644