మరో 30కి.మీలలో ఇల్లు ఉందనగా.. ‘కరోనా’తో వలస కూలీ మృతి..!

లాక్‌డౌన్‌ కొనసాగిస్తోన్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైన విషయం తెలిసిందే.

మరో 30కి.మీలలో ఇల్లు ఉందనగా.. 'కరోనా'తో వలస కూలీ మృతి..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 3:30 PM

లాక్‌డౌన్‌ కొనసాగిస్తోన్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఇప్పటికే తమ ఊర్లకు చేరుకున్నారు. కాగా మరో 30కి.మీలలో తన ఇల్లు ఉందనగా.. ఓ వలసకూలీ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌కి చెందిన రామ్ క్రిపాల్ అనే వ్యక్తి ముంబయిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులు ముంబయిలోనే ఉండిపోయిన రామ్‌.. తాజాగా తన ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రక్కులో నాలుగు రోజులుగా 1600కి. మీలు ప్రయాణించారు. మరో 30 కి.మీలలో అతడి సొంత గ్రామం ఉందనగా.. సృహ తప్పి కిందపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ఆ తరువాత అతడికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రక్‌లో అతడు కాంటాక్ట్ అయిన వారి వివరాలను పోలీసులు కనుగొనే పనిలో పడ్డారు. కాగా వలస కార్మికులు వారి వారి స్వరాష్ట్రాలకు వెళుతోన్న క్రమంలో.. కరోనా కేసులు మరిన్ని భయటపడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోకి వస్తోన్న కొత్త వారి వివరాలను తెలపాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.

Read This Story Also: హరీష్ వర్సెస్ బండ్ల.. వివాదం ముగిసేలా లేదుగా..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.