కరోనా దెబ్బకు మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించిన న్యూయార్క్

కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా అల్లకల్లోలంగా మారింది. మిగతా ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో ఆరు లక్షలా 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఏకంగా 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం..

కరోనా దెబ్బకు మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించిన న్యూయార్క్
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 8:18 AM

కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా అల్లకల్లోలంగా మారింది. మిగతా ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో ఆరు లక్షలా 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఏకంగా 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 11,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మే 15 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో అంటే ఒకే రోజు ఏకంగా 606 మంది ప్రజలు కరోనాతో మరణించారని ఆయన తెలిపారు. అయితే గత పది రోజులుతో పోలిస్తే ఇది తక్కువ ప్రాణ నష్టం కావడం గమనార్హం.

లాక్‌డౌన్‌ను నెల రోజుల పాటు విధిస్తున్నట్లు ప్రకటించిన న్యూయార్క్ గవర్నర్ ఆ తర్వాత లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని లేదంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక న్యూయార్క్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో.. న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాలకు 100 చొప్పున వెంటిలేటర్లను అందజేయాలని గవర్నర్ ఆండ్రూ కువోమో నిర్ణయించారు.

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..