Breaking : ఆ రాష్ట్రంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్​డౌన్​…ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మిజోరాం ప్రభుత్వం జూన్ 9 నుండి రాష్ట్రంలో 2 వారాల పూర్తి లాక్ డౌన్ విధించాలని సోమవారం నిర్ణయించింది.

Breaking : ఆ రాష్ట్రంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్​డౌన్​...ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 08, 2020 | 6:03 PM

కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మిజోరాం ప్రభుత్వం జూన్ 9 నుండి రాష్ట్రంలో 2 వారాల పూర్తి లాక్ డౌన్ విధించాలని సోమవారం నిర్ణయించింది. లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూన్ 9 నుంచి రాష్ట్రంలో 2 వారాల మొత్తం లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రి జోరమ్‌తంగా అధ్యక్షతన జరిగిన సంప్రదింపుల సమావేశం నిర్ణయించినట్లు మిజోరాం ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మిజోరాంకు తిరిగి వచ్చిన ఐదుగురు వ్యక్తులకు శుక్రవారం కోవిడ్-19 సోకిన‌ట్టు నిర్దార‌ణ అయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు 22 కు పెరిగాయి. కొత్త‌గా న‌మోదైన 5 కేసుల్లో న‌లుగురు ఢిల్లీ నుంచి రాగా, ఒక‌రు గుజ‌రాత్ నుంచి వ‌చ్చారు. వీరిలో ఇద్దరు మ‌హిళ‌లు ఉన్నారు.