మందుబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మద్యం అమ్మకాలకు ఓకే..!

కరోనా నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఎవ్వరు బయటకు రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మందుబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మద్యం అమ్మకాలకు ఓకే..!
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 3:58 PM

కరోనా నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఎవ్వరు బయటకు రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే లాక్‌డౌన్ మందుబాబులపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. మద్యం కోసం అల్లాడుతున్న మందుబాబులు.. అది దొరక్కపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొన్ని ప్రదేశాల్లో వారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో మందుబాబుల ఆర్తనాదాలు విన్న కేరళ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు కేరళ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్ తీసుకు వచ్చిన వారికి మాత్రమే మద్యం విక్రయించనున్నట్లు షరతు విధించింది. ఈ క్రమంలో వారికి ప్రత్యేక ‘లిక్కర్​ పాస్’​లు ఇవ్వాలని నిర్ణయించింది. వీలైతే ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు కేరళ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మద్యం లేక మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురైనవారు ముందుగా డాక్టర్​ను కలవాలి. వైద్యులు ​ రాసిచ్చిన చీటీ తీసుకుని దగ్గర్లోని అబ్కారీ అధికారికి అందిస్తే.. అక్కడ లిక్కర్​ పాస్​లు జారీ చేస్తారు. అయితే వారి కోసం మద్యం దుకాణాలు తెరిచి ఉంచాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. లిక్కర్​ పాస్​లు పొందినవారు నేరుగా అబ్కారీ అధికారుల వద్దే మద్యం కొనుక్కోవచ్చని తెలిపింది.

Read This Story Also: ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌కు షాకిచ్చిన అజయ్‌ దేవగన్..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!