లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఎర్రగడ్డకు పెరుగుతోన్న మందుబాబుల సంఖ్య..!

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి మద్యం దొరక్క మందుబాంబులు పిచ్చెక్కిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోగా..

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఎర్రగడ్డకు పెరుగుతోన్న మందుబాబుల సంఖ్య..!
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 1:45 PM

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి మద్యం దొరక్క మందుబాంబులు పిచ్చెక్కిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోగా.. మరికొంతమంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోన్న వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ఎర్రగడ్డలో 800కు పైగా కేసులు నమోదయ్యాయి. గత రోజుల్లో పోలిస్తే ఇలాంటి కేసులు 98 శాతం పెరిగాయని వైద్యులు చెబుతున్నారు.  ఇందులో వంద మంది ఆరోగ్యం నుంచి కుదుటపడి డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారిగా మద్యాన్ని ఆపితే 24 గంటల్లోనే ఆ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా చూపిస్తుందని.. నిన్న ఒక్క రోజులోనే 200 మంది ఔట్‌ పేషంట్లు చికిత్స తీసుకున్నారని ఎర్రగడ్డ వైద్యులు చెబుతున్నారు.

Read This Story Also: Breaking: లాక్‌డౌన్‌ పొడిగించిన ఒడిశా.. ఎప్పటి వరకు అంటే..!