Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • ప్రధానితో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కీలక చర్చ. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రులు అభిప్రాయాలను ప్రధానితో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కారుకు ఎదురుదెబ్బ తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి పరాభవాలు తప్పవు ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయన్న విషయం గ్రహించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించిన రమేశ్ కుమార్ కూడా ఏ పార్టీకి అనుబంధంగా ఉండకుండా, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలను వాయిదా వేసే వరకు అధికారపక్షానికి, వాయిదా తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కనిపించింది రాజ్యాంగ విలువలను కాపాడేలా అధికారులు పనిచేయాలి జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ

కరోనా క్రైసిస్‌: అమ్మ నాన్న స్పూర్తితో.. రాజశేఖర్ కుమార్తెల ఉదారభావం..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్ పలు రంగాలపై పడింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో రోజువారీ జీతం మీద ఆధారపడిన చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి.
Coronavirus Live Updates, కరోనా క్రైసిస్‌: అమ్మ నాన్న స్పూర్తితో.. రాజశేఖర్ కుమార్తెల ఉదారభావం..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్ పలు రంగాలపై పడింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో రోజువారీ జీతం మీద ఆధారపడిన చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. వారిలో సినీ కార్మికులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పెట్టిన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి ఇప్పటికే పలువురు తమ వంతు విరాళాలను ఇచ్చారు. ఈ క్రమంలో జీవితా, రాజశేఖర్ దంపతుల ఇద్దరు కుమార్తెలు తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.

కరోనా క్రైసిస్‌ ఛారిటీకి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు శివానీ, శివాత్మిక ప్రకటించారు. ఈ మేరకు జీవితా రాజశేఖర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. “ఇప్పటికే రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కరోనా క్రైసిస్‌ ఉన్నంతవరకు సాగుతుంది. అలాగే కరోనా క్రైసిస్ ఛారిటీలో మా కుటుంబం కూడా భాగం అయింది. మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికలు చెరో లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి, కష్టాల్లో ఉన్న పేద కార్మికులకు సహాయం అందించడంలో మా కుటుంబం సహాయం ఎప్పుడూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని ఆమె అన్నారు.

Read This Story Also: హైదరాబాద్‌లో సెంచరీ క్రాస్.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎంతంటే..!

Related Tags