Corona Effect: వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా పరీక్షా ఫలితాలు..!

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతోంది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Corona Effect: వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా పరీక్షా ఫలితాలు..!
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2020 | 12:05 PM

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతోంది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 31వరకు స్కూళ్లు, కాలేజీలు మూసేయించారు. పలు రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. వాటిని మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. వాటి ఫలితాలు త్వరలో వెల్లడికానుండగా.. వీటిని వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

సాధారణంగా కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఫలితాలను ఎప్పుడూ చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో వినూత్నంగా వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు వారు సిద్ధమవుతున్నారు. అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా.. ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. పాఠశాలల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయని.. నేరుగా కాలేజీలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు.