Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

కరోనా వైరస్.. ప్రజల్లేకుండానే ప్రార్థనలు చేసిన పోప్..!

కరోనా వైరస్ కారణంగా అమెరికాలోని వాటికన్‌ సిటీ వెలవెలబోయింది. ప్రతి ఏటా గుడ్‌ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్‌) ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు.
Coronavirus Live updates, కరోనా వైరస్.. ప్రజల్లేకుండానే ప్రార్థనలు చేసిన పోప్..!

కరోనా వైరస్ కారణంగా అమెరికాలోని వాటికన్‌ సిటీ వెలవెలబోయింది. ప్రతి ఏటా గుడ్‌ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్‌) ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్‌ సిటీని మూసివేయడంతో.. ప్రజలు లేకుండానే పోప్ ఫ్రాన్సిస్‌ ప్రార్థనలు చేశారు. ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్‌ పీటర్స్‌ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమానికి 25 మంది మాత్రమే హాజరు కాగా, వారు కూడా సోషల్ మెయింటెనెన్స్ పాటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా.. లక్షలాది మంది వీక్షించారు.

అనంతరం పోప్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, అందరి హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి విషాదం నింపిన సమయంలో,  మన హృదయాలపై బరువెక్కిన త్యాగ భావనలో,  దైవం వైపు చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

Read This Story Also: కలకలం రేపిన విందు.. క్వారంటైన్‌లో 26వేల మంది

Related Tags