ఓ వైపు కరోనా చికిత్స.. మరోవైపు పరీక్షలు.. స్ఫూర్తి కలిగిస్తోన్న విద్యార్థిని కథ

ఓ వైపు కరోనాకు చికిత్స తీసుకుంటూ.. మరోవైపు పరీక్షలు రాసింది ఓ విద్యార్థి. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లింది.

ఓ వైపు కరోనా చికిత్స.. మరోవైపు పరీక్షలు.. స్ఫూర్తి కలిగిస్తోన్న విద్యార్థిని కథ
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 1:34 PM

ఓ వైపు కరోనాకు చికిత్స తీసుకుంటూ.. మరోవైపు పరీక్షలు రాసింది ఓ విద్యార్థి. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లింది. కరోనా నేపథ్యంలో భారత్‌కు వచ్చేసింది. ఆ తరువాత ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోగా.. కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ మూడు రోజుల తరువాత తనతో పాటు వచ్చిన స్నేహితులకు పాజిటివ్ వచ్చినట్లు తేలగా.. అప్రమత్తమైన విద్యార్థి మరోసారి పరీక్షలు చేయించుకుంది. అందులో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది.

అయితే అదే సమయంలో తన యూనివర్సిటీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలను ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఆ విద్యార్థి.. ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటూ పరీక్షలకు సన్నద్ధమైంది. అలా నాలుగు పరీక్షలను ఆన్‌లైన్‌లోనే రాసింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం కూడా కుదుటపడింది. రెండు పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో.. ఈ నెల 6న డిశ్చార్జ్‌ అయ్యింది. తన ఇంటికి వెళ్లే రోజే ఆసుపత్రి నుంచే ఇంటర్నిషిప్‌ కోసం ఇంటర్వ్యూలో కూడా పాల్గొనింది. కరోనా సమయంలో డిప్రెషన్‌కు గురి కాకుండా ఉండేందుకే తాను పరీక్షలపై దృష్టి సారించానని ఆ యువతి చెప్పుకొచ్చింది.

Read This Story Also: Breaking: ఏపీ మరో కీలక నిర్ణయం.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మారో..!