దేశ వ్యాప్తంగా 11 వేలకు పైగా.. విశ్వ వ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా..

ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.. రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్లకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారు దాదాపు ఐదు లక్షలకు చేరువలో ఉన్నారు. ఇక కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 29వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా […]

దేశ వ్యాప్తంగా 11 వేలకు పైగా.. విశ్వ వ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా..
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 10:35 PM

ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.. రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్లకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారు దాదాపు ఐదు లక్షలకు చేరువలో ఉన్నారు. ఇక కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 29వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా 11,933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1118 కేసులు కొత్తగా వచ్చినవే. ప్రస్తుతం 10,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1344 మంది కరోనా జయించి బయటపడ్డారు. వారందరినీ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 392 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 39 మంది మృతిచెందారు.

కాగా.. ముంబై, ఇండోర్ నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. ప్రజలంతా లాక్‌డైన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి.