బ్రేకింగ్‌.. దేశంలో కరోనా@50వేలు.. మూడు రోజుల్లో నమోదైన కేసులు చూస్తే షాక్..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొలుత పదులు వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా ఇప్పుడు యాభై వేల మార్క్‌ను దాటింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే పది వేల కొత్త కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుధవారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 50545కి చేరింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర […]

బ్రేకింగ్‌.. దేశంలో కరోనా@50వేలు.. మూడు రోజుల్లో నమోదైన కేసులు చూస్తే షాక్..
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 8:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొలుత పదులు వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా ఇప్పుడు యాభై వేల మార్క్‌ను దాటింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే పది వేల కొత్త కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుధవారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 50545కి చేరింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14వేలకు చేరింది. ఇక కరోనా బారినపడి ప్రాణాలుకోల్పోయిన వారి సంఖ్య 1650కి చేరింది. దేశ వ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక కేరళ వంటి రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కేరళలో ముప్పై మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు సీఎం పినరయ్  విజయన్ పేర్కొన్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..