డేంజర్‌ బెల్స్.. దేశంలో 17 వేల మార్క్ దాటిన కరోనా కేసులు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి 24 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం నాటికి దేశంలో కరోనా కేసులు 17వేల మార్క్‌ను దాటాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 17,656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 559 మంది ప్రాణాలు […]

Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 6:48 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి 24 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం నాటికి దేశంలో కరోనా కేసులు 17వేల మార్క్‌ను దాటాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 17,656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 559 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 14,255 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2842 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,01,586 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 4203 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరక 223 మంది కరోనాతో మరణించారు. ఇక ఢిల్లీలో 2003 కేసులు నమోదవ్వగా..45 మంది మృతి చెందారు.గుజరాత్‌లో 1851 కేసులు నమోదవ్వగా.. 67 మంది ప్రాణాలు కోల్పోయారు.రాజస్థాన్ లో 1478 కేసులు, మృతులు 14 మంది, మధ్యప్రదేశ్‌లో 1485 కేసులు నమోదవ్వగా..74 మంది చనిపోయారు. ఇక యూపీలో 1176 కేసులు నమోదవ్వగా… ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.