దేశంలో కొత్తగా మరో వెయ్యి కేసులు.. 32 మరణాలు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌ను విడుదల చేసింది. సాయంత్రం 5.00 గంటల వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1767కు చేరుకుంది. ఇక […]

దేశంలో కొత్తగా మరో వెయ్యి కేసులు.. 32 మరణాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 8:40 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌ను విడుదల చేసింది. సాయంత్రం 5.00 గంటల వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1767కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 452 మంది ప్రాణాలు కోల్పోయారని.. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 11,616 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.ఇక గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 1076 కేసులు నమోదవ్వగా.. 32 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అంతేకాదు మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ముంబై, పూణెలో అత్యధికంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది.