కరోనా విళయ తాండవం.. 42 లక్షల మార్క్ దాటిన కేసులు

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. మానవ మనుగడకు ఈ వైరస్ పెను సవాల్‌గా మారింది. దీనికి ఇప్పటి వరకు విరుగుడు మందు లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడంలో అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు కూడా ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా […]

కరోనా విళయ తాండవం.. 42 లక్షల మార్క్ దాటిన కేసులు
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 11:41 AM

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. మానవ మనుగడకు ఈ వైరస్ పెను సవాల్‌గా మారింది. దీనికి ఇప్పటి వరకు విరుగుడు మందు లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడంలో అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు కూడా ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42. 5 లక్షల మార్క్‌ను  చేరింది. వీరిలో 2.87 లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15.2 లక్షలకు చేరింది. ఇక మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 24.4 లక్షల మంది కరోనాతో ఆస్పత్రుల్లో పోరాడుతున్నట్లు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 13 లక్షలు దాటగా.. 82 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక స్పెయిన్, ఇటలీ, యూకే, రష్యాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడ మరణాలు సంఖ్య కూడా నిత్యం వందలు, వేలల్లో ఉండటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.