‘ఇది కరోనా సునామీ.. మేల్కొనాల్సిందే’.. రాహుల్ గాంధీ

కరోనా వ్యాప్తిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ 'సునామీ'గా అభివర్ణించారు. దీన్ని అదుపు చేయలేకపోతే వచ్ఛే ఆరు నెలల్లో దేశంలో తీవ్ర ఆర్ధిక అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు

'ఇది కరోనా సునామీ.. మేల్కొనాల్సిందే'.. రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 3:05 PM

కరోనా వ్యాప్తిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ‘సునామీ’గా అభివర్ణించారు. దీన్ని అదుపు చేయలేకపోతే వచ్ఛే ఆరు నెలల్లో దేశంలో తీవ్ర ఆర్ధిక అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశ ప్రజలు ఊహించలేనంత బాధను అనుభవిస్తున్నారని, దేశ ఎకానమీ అత్యంత ఒడిదుడుకుల్లో ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ రాక ముందు సముద్రంలో నీరంతా లేకపోయిందని, అది చూసి పెద్ద సంఖ్యలో ప్రజలు చేపలు పట్టడానికి వెళ్లారని, అయితే ఒక్కసారిగా ఉప్పెన ముంచుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. దాంతో ఏం చేయాలో వారికి తోచలేదన్నారు. ఇప్పుడు ఈ దేశంలో కరోనా వైరస్ కూడా ఆ సునామీ లాంటిదే అన్నారు. ఈ వైరస్ నివారణ విషయంలోనే కాదు.. దేశ ఆర్ధిక పరిస్థితి కూడా ఎలా క్షీణిస్తుందో అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇలా చెప్పడానికి తానెంతో విచారిస్తున్నానన్నారు. కరోనా వైరస్ పెద్ద ప్రాబ్లమ్ అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది పరిష్కారం కాబోదని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీని అదుపునకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఓ వీల్ చైర్ లో నిద్రిస్తుండగా.. ఈ దేశం పెద్ద ప్రమాదం వైపు దూసుకుపోతోంది అని ఆయన అన్నారు. మోదీకి ఏం చేయాలో పాలుపోవడంలేదు.. మనం మాత్రం యాక్సిడెంట్ దిశగా వెళ్తున్నాం అని రాహుల్ పనిలో పనిగా మోదీని దుయ్యబట్టారు.