Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

ఆ విషయంలో కరోనావైరసే బెటర్

coronavirus is better than other, ఆ విషయంలో కరోనావైరసే బెటర్

కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్‌ వైరస్‌లు చాలానే ఉన్నాయి.. అంతెందుకు ఈ మధ్యనే అమెరికాలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది… ఇందులో ఓ 60 మంది చిన్నారులున్నారు. ఓ పదిహేను లక్షల మందిని ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ పట్టి పీడించిందట! దీన్నే హెచ్‌1 ఎన్‌1 అంటారు.. లక్షన్నరమంది ప్రాణం మీదతీపితో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారట!

ఇదేదో అమెరికా అంటే పడనివాళ్లు చెప్పిన మాట కాదు.. సాక్షాత్తు అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ చెప్పిన సత్యం…అంతమంది ప్రాణాలను తీసుకున్నా ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ఇంకా దాహం తీరలేదు.. మరిన్ని ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నది… ఇప్పుడీ కరోనా ఒకటి దానికి తోడైంది… ఈ రెండూ కలిస్తే పరిస్థితి బీభత్స భయానకమే!

చాలా విషయాలను అమెరికా బయటకు పొక్కనివ్వకుండా దాచేస్తుంది… అగ్రరాజ్యం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటివి అస్సలు బయటపడనివ్వదు.. అమెరికాలో రోగాలు రొచ్చులు ఉండవనుకుంటాం కానీ అక్కడా ఉంటాయి.. అమెరికా జనానికి ఈ ఫ్లూ వైరస్‌ కొత్తేమీ కాదు.. వైరస్‌ దెబ్బను అనుభవించింది.. అల్లాడిపోయింది.. ఏటా కొన్ని వేల మంది ప్రాణాలను ఈ వైరస్‌ అవలీలగా మింగేస్తుంటుంది.. అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం.. మెడికల్‌ క్యాంపులు పెట్టడం వల్ల కేసుల సంఖ్య కాసింత తగ్గింది..

2017-18లో అయితే నాలుగున్నర కోట్ల మంది ఫ్లూ జ్వరంతో నరకయాతన అనుభవించారు.. ఇందులో 61 వేల మంది చనిపోయారు.. లాస్ట్‌ సీజన్‌లో కోటి 70 లక్షల మంది ఫ్లూ బారిన పడి మందులు మాకులు మింగారు.. అవి కూడా పని చేయక ఓ 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెబుతున్నదేమిటంటే అక్కడ సంవత్సరానికి 12 వేల నుంచి 64 వేల మంది ఫ్లూ వైరస్‌తో చనిపోతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది హరీమంటున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి మరీ చెబుతోంది.. ఈ లెక్కన కరోనా వైరస్‌ ఏపాటిది..?

జనరల్‌గా చాలామంది ఫ్లూను లైట్‌ తీసుకుంటారు.. ఫ్లూనే కదా అని నెగ్లెట్‌ చేస్తారు.. ఫ్లూ సోకడం.. దాంతో పాటు మరో ఇన్‌ఫెక్షన్‌ రావడం అంటూ జరిగిందా..? అంతే ..! ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం.. న్యూమోనియా రావచ్చు.. మెదడువాపు వ్యాధి రావచ్చు…మరేదైనా జరగొచ్చు… కొనిసందర్భాలలో శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయనూ వచ్చు.. అప్పుడా రోగి పడే అవస్థల కంటే ప్రాణం పోవడమే మంచిదనిపిస్తుంది…హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ను అంతం చేసే మందే లేదా..? అంటే ఉంది కానీ.. ఆ వైరస్‌ ఎప్పటికప్పుడు తనను తాను మార్చేసుకుంటూ వస్తోంది.. ఏడాదికేడాది బలోపేతం అవుతూ వస్తోంది… అందుకే ఎప్పటికప్పుడు మందులను అప్‌గ్రేడ్‌ చేసుకురావలసి వస్తోంది… ఇప్పుడనిపిస్తుంది కదూ.. కరోనానే కాసింత బెటరని..!

Related Tags