మీ ఇంట్లోనే డాక్టర్, పోలీస్ ఉంటే ఇలా చేస్తారా..?: హీరో ఫైర్

దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్లు, పోలీసుల్ని కొట్టడం దారుణమని యాక్షన్ కింగ్ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉందని..

మీ ఇంట్లోనే డాక్టర్, పోలీస్ ఉంటే ఇలా చేస్తారా..?: హీరో ఫైర్
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 2:10 PM

దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్లు, పోలీసుల్ని కొట్టడం దారుణమని యాక్షన్ కింగ్ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తుంటే వారిపై దాడులు జరగడం బాధాకరమని ఆయన అన్నారు. ఇదొక అజ్ఞాతవాసం అనుకుని ఇంట్లోనే ఉండండని అర్జున్ సూచించారు. ఇంట్లోనే ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్నే కాకుండా రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కాపాడినవారు అవుతారని ఆయన అన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తనను ఎంతో బాధించాయని.. డాక్టర్లు, పోలీసుల్ని కొట్టడం, వారితో గొడవలు పడటం దారుణమని పేర్కొన్నారు. మీ ఇంట్లోనే డాక్టరో, నర్సో, పోలీసో  ఉంటే.. అప్పుడు కూడా ఇలాగే చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ఫ్యామిలీని, పిల్లలని వదిలి మనల్ని రక్షించడానికి వారంతా ఎంత కృషి చేస్తున్నారో గమనించి.. ఒక బాధ్యత గల పౌరుడిగా నడుచుకోండని ఆయన సూచించారు.

Read This Story Also: షాకింగ్‌.. గాంధీ ఆసుపత్రి నుంచి పరారైన కరోనా బాధితుడు