ప్ర‌ధాని పిలుపుతో దీప‌మై ప్ర‌కాశించిన యావ‌త్ భార‌తం..

ప్ర‌ధాని పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాల‌ను వెలిగించిన యావ‌త్ భారతం ఆ వెలుగుల‌తో ఐఖ్య‌త‌ను చాటింది. విద్యుత్ దీపాలు అన్నీ ఆపి..కేవ‌లం టార్చ్ లైట్లు, దీపాలు, కొవ్వుత్తుల వెలుగుల‌తో కోట్ల మంది ప్ర‌జ‌లు భార‌తావ‌ని పుల‌కించిపోయేలా చేశారు. ఈ గొప్ప కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ ల‌తో పాటు ప‌లువురు క్రీడాకారులు, సినీ ప్ర‌ముఖులు, ప‌లువురు సెలబ్రిటీలు సైతం భాగ‌మ‌య్యారు. . ఇక దేశం మొత్తం […]

ప్ర‌ధాని పిలుపుతో  దీప‌మై ప్ర‌కాశించిన యావ‌త్ భార‌తం..
Follow us

|

Updated on: Apr 05, 2020 | 11:00 PM

ప్ర‌ధాని పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాల‌ను వెలిగించిన యావ‌త్ భారతం ఆ వెలుగుల‌తో ఐఖ్య‌త‌ను చాటింది. విద్యుత్ దీపాలు అన్నీ ఆపి..కేవ‌లం టార్చ్ లైట్లు, దీపాలు, కొవ్వుత్తుల వెలుగుల‌తో కోట్ల మంది ప్ర‌జ‌లు భార‌తావ‌ని పుల‌కించిపోయేలా చేశారు. ఈ గొప్ప కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ ల‌తో పాటు ప‌లువురు క్రీడాకారులు, సినీ ప్ర‌ముఖులు, ప‌లువురు సెలబ్రిటీలు సైతం భాగ‌మ‌య్యారు. . ఇక దేశం మొత్తం 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పినా… విద్యుత్ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం చూప‌లేదు. ఈ మేరకు విద్యుత్ వ్యవస్థ అంతా సజావుగా న‌డుస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ స్పష్టంచేశారు.