షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2000 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. దాదాపుగా అన్ని జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. రోజుకు సుమారుగా 1500లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం అధికార యంత్రాంగంతో పాటు, ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి తరుణంలో జీహెచ్‌ ఎంసీ అధికారులు మరో షాకింగ్ న్యూస్‌ వెల్లడించారు.

షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2000 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్!
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:38 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. దాదాపుగా అన్ని జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. రోజుకు సుమారుగా 1500లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం అధికార యంత్రాంగంతో పాటు, ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదు అవుతుండగా, ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే రోజుకు 700లకు పైగా కేసులుంటున్నాయి. ఇటువంటి తరుణంలో జీహెచ్‌ ఎంసీ అధికారులు మరో షాకింగ్ న్యూస్‌ వెల్లడించారు.

కరోనా పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిట్ల సాయంతో కరోనా బాధితులు ఆస్పత్రులకు వెళ్లకుండా వారి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందవచ్చు. ఈ విధంగా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీయగా నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అది తెలిసి జీహెచ్ఎంసీ అధికారులే ఖంగుతిన్నారు. చికిత్స తీసుకుంటున్న వందలాది మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో 2000 మందికిపైగా కరోనా పేషెంట్లు మిస్సయ్యారనే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. హోం ఐసోలేషన్ కిట్లను అందించడం కోసం బాధితుల వివరాలను ఆరా తీస్తుంటే ప్రతి రోజూ పదుల సంఖ్యలో బాధితుల వివరాలను వైద్య సిబ్బంది గుర్తించలేకపోతున్నారని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ బదావత్ సంతోష్ తెలిపారు.

కోవిడ్‌ లక్షణాలతో వచ్చి టెస్టులు చేయించుకున్న కొందరు బాధితులు వారికి పాజిటివ్‌ అని తేలగానే..ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అధికారులకు దొరకకుండా తప్పుడు అడ్రస్‌లు ఇచ్చి తప్పించుకుంటున్నారని చెప్పారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన వారు ముందుకు వచ్చి అధికారులకు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్‌ కోరారు. వైరస్‌ సోకిన వారు రోడ్ల మీద తిరిగితే వారి వల్ల ఇతరులకు వైరస్‌ సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారంతా బాధ్యతగా వ్యహరించి వైరస్‌ నియంత్రణ పట్ల ప్రభుత్వానికి సహకరించాలని,.. తప్పుడు వివరాలు ఇచ్చిన కరోనా బాధితులను లోకేష్ కుమార్‌ కోరారు.