హైదరాబాద్‌లో కరోనా ఉధృతి..ఆ ఆస్పత్రుల్లో 31మంది వైద్య సిబ్బందికి వైరస్ పాజిటివ్

హైదరాబాద్ మహానగరాన్ని వైరస్ వణికిస్తోంది. రోజుకూ వందకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండగా, కోవిడ్ బారిన పడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వైద్య శాఖలో కరోనా కలకలంతో ప్రభుత్వానికి మరింత తల నొప్పిగా మారింది.

హైదరాబాద్‌లో కరోనా ఉధృతి..ఆ ఆస్పత్రుల్లో 31మంది వైద్య సిబ్బందికి వైరస్ పాజిటివ్
Doctors
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 11:52 AM

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జనవరి 30వ తేదీ నాటికి దేశంలో కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే ఉండగా..జూన్ 4 నాటికి ఆ సంఖ్య 2లక్షలు దాటింది. మొదటి వంద కేసులు దాటడానికి 44 రోజులు పట్టింది. వంద నుండి వెయ్యి చేరడానికి 15 రోజులు పట్టింది. వెయ్యి నుండి పదివేలు చేరడానికి 16 రోజులు పట్టింది. 10 వేల నుండి లక్ష చేరడానికి 35 రోజులు పట్టింది. లక్ష నుండి రెండు లక్షలు చేరడానికి 15 రోజులు పట్టింది. దీనిని బట్టి దేశంలో కోవిడ్ భూతం ఏ స్థాయిలో ప్రతాపం చూపుతోందే తెలుస్తోంది. ఇక దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, తమిళనాడు, గుజరాత్‌లు ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. గత నెలరోజులుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఊపందుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని వైరస్ వణికిస్తోంది. రోజుకూ వందకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండగా, కోవిడ్ బారిన పడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వైద్య శాఖలో కరోనా కలకలంతో ప్రభుత్వానికి మరింత తల నొప్పిగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 31 మంది డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు కోవిడ్-19 బారిన పడ్డారు. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే కొందరు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిమ్స్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో పని చేసే నలుగురు డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు కోవిడ్ సోకిందని బుధవారం నిర్ధారణ అయ్యింది. పేట్లబురుజు ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పని చేసే ఒక ప్రొఫెసర్, ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో పని చేసే పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్లు, నలుగురు హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రి నుంచి 20 మంది డాక్టర్ల శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపించారు. వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమకు కూడా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వైద్య సిబ్బంది నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌