PF ఖాతాదారులకు మ‌రో గుడ్‌న్యూస్‌…ఆధార్ కార్డుతో మరో అదిరిపోయే బెనిఫిట్!

కోవిడ్‌-19 నేప‌థ్యంలో దేశప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తాజాగా...

PF ఖాతాదారులకు మ‌రో గుడ్‌న్యూస్‌...ఆధార్ కార్డుతో మరో అదిరిపోయే బెనిఫిట్!
Follow us

|

Updated on: Apr 06, 2020 | 10:28 AM

కోవిడ్‌-19 నేప‌థ్యంలో దేశప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ నందించింది.

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆన్‌లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. ఆన్‌లైన్‌లోనే పుట్టిన తేదీ వివరాలను మార్చుకునేందుకు నిబంధనలను సవరించింది. దీని కోసం కేవైసీ నిబంధనలను సరళీకరించింది. ఈ మేర‌కు కేంద్ర కార్మిక శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

కార్మిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పీఎఫ్ అకౌంట్‌లో పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్‌ను ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. వేగంగానే పని పూర్తవుతుంది. కొత్త రూల్స్‌కు సంబంధించి ఈపీఎఫ్‌వో ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ రిక్వెస్ట్‌లను వెంటనే ప్రాసెస్ చేయాలని కూడా సూచించింది. దీంతో వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవాలని తెలిపింది. కాగా ఈపీఎఫ్‌వో ఇటీవలనే పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ కూడా సవరించిన విషయం తెలిసిందే.