కరోనా ప్రమాదఘంటికలు..క‌న్నీటి చుక్క‌ల్లోనూ..

కరోనా చెలరేగిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి 49 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకూ 2,800 మంది బలైపోయారు. చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తున్నా, కొత్తగా దక్షిణకొరియా, ఇరాన్‌లాంటి దేశాలను వణికిస్తోంది. ఇటలీలో కూడా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇక బ్రెజిల్‌లో తొలికేసు నమోదయింది. జపాన్‌ తీరంలో నిలిచిపోయిన నౌకలో , మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా చైనా విడుదల చేసిన ఓ నివేదిక మరింత భయపెడుతోంది.

కరోనా ప్రమాదఘంటికలు..క‌న్నీటి చుక్క‌ల్లోనూ..
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 6:56 PM

ప్రమాదఘంటికలు.. కరోనా చెలరేగిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి 49 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకూ 2,800 మంది బలైపోయారు. చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తున్నా, కొత్తగా దక్షిణకొరియా, ఇరాన్‌లాంటి దేశాలను వణికిస్తోంది. ఇటలీలో కూడా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇక బ్రెజిల్‌లో తొలికేసు నమోదయింది. జపాన్‌ తీరంలో నిలిచిపోయిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో , మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అటు సౌదీ అరేబియా , మదీనా సందర్శనకు వచ్చే యాత్రికులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దక్షిణకొరియాలో వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఉత్తరకొరియా గురించి మిగతాదేశాల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా విడుదల చేసిన ఓ నివేదిక మరింత భయపెడుతోంది.

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్- 19 వైరస్ కేవ‌లం ఊపిరితిత్తులోనే కాదు.. క‌న్నీటి చుక్క‌ల్లోనూ క‌నిపిస్తోంద‌ట‌. చైనాలోని జీజియాంగ్ వ‌ర్సిటీకి చెందిన హాస్ప‌ట‌ల్ తాజాగా ఓ నివేదిక‌ను రిలీజ్ చేసింది. కరోనా వైర‌స్ సోకిన పేషెంట్ల‌పై .. డాక్ట‌ర్లు అనేక ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారి పూర్తి విశ్లేషణపై కథనాన్ని ప్రచురించారు. క‌న్నీటి చుక్క‌ల‌తో పాటు కండ్ల నుంచి వ‌చ్చే ఇత‌ర ద్ర‌వాల్లోనూ క‌రోనా వైర‌స్ ఛాయ‌లు ఉన్న‌ట్లు తేల్చారు. కోవిడ్‌ -19 వ్యాధి సోకిన సుమారు 30 మంది రోగుల‌ను ఆ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ప‌రీక్షించారు.

రోగుల‌ క‌న్నీటి చుక్క‌లు, కండ్ల‌క‌ల‌కల్లోనూ వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధారించారు. క‌రోనా వైర‌స్ కేవ‌లం ఊపిరితిత్తుల‌కే కాకుండా, ఇత‌ర శ‌రీర భాగాల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. అయితే వైద్య సేవ‌లు అందించే వ‌ర్క‌ర్లు కేవ‌లం మాస్క్‌లు మాత్ర‌మే కాదు, కంటి అద్దాలు కూడా ధ‌రించాల్సి ఉంటుంద‌ని పరిశోధకులు వెల్లడించారు. మాన‌వ శ‌రీరం దాటిన క‌రోనా వైర‌స్‌.. ఏవైనా వ‌స్తువుల‌పై సుమారు రెండు నుంచి అయిదు రోజుల వ‌ర‌కు బ్ర‌తికే అవకాశాలు ఉన్న‌ట్లు తెలిపారు.

కొవిడ్ -19ను అరికట్టేందుకు చైనా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ వైరస్‌ని గుర్తించేందుకు చైనాలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. షాంగైలో అధికారులు వైరస్‌ను గుర్తించేందుకు లిఫ్ట్‌లో ప్రత్యేక పరికరాలను అమర్చారు. లిఫ్ట్‌లోకి ఎక్కగానే వ్యక్తిలోని వైరస్‌ లక్షణాలు గుర్తించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్‌ను ప్రయోగ పూర్వకంగా పరీక్షించారు. చైనాలో కోవిడ్ మృతుల సంఖ్య పెరగడంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!