Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • నిమ్స్ లో లాంఛనంగా ప్రారంభమైన బూస్టర్ డోసేజ్ . క్లినికల్ ట్రయల్స్ లో మొదటి దశ-రెండో దశకు మధ్యలో వాలంటీర్లకు బూస్టర్ డోసేజ్. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన వైద్య బృందం. నిన్న 11 మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం. నేడు మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్న నిమ్స్ వైద్య బృందం.
  • బులియన్ మార్కెట్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. రూ.1,317 తగ్గిన బంగారం ధర. ఏకంగా రూ. 2,900కు పైగా తగ్గిన వెండి ధర. రూపాయి బలపడటమే కారణమన్న నిపుణులు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రి మండలి సమావేశం. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి సమన్వయం లో మొదలైన సమావేశం. హాజరయిన మంత్రులు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

కన్న కూతురు కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి..!

Coronavirus effected Father Turns Night Watchman For His Daughter In Quarantined, కన్న కూతురు కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి..!

కన్న కూతురు కోసం వాచ్‌మన్‌గా మారాడో తండ్రి. క్వారంటైన్ లో ఉన్న కుమార్తెకి రక్షణగా నిలిచాడు. ఆడవికి దగ్గరగా ఉన్న గ్రామంపై జంతువులు దాడి కాపాడుకుంటున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కుడెకెలాకి చెందిన సుధీర్ ఖల్కో కూతురు ఇటీవల ఒడిశా నుంచి స్వగ్రామానికి వచ్చింది. దీంతో ఆమెను ధరమ్‌జైగఢ్ ప్రభుత్వ హైస్కూల్ భవనంలో క్వారంటైన్‌లో ఉంచారు. ధరమ్‌జైగఢ్‌ గ్రామంపై తరుచూ ఏనుగుల దాడి చేస్తూంటాయి. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో నలుగురు గ్రామస్థులను ఏనుగులు మట్టుబెట్టాయి. అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా సరిగాలేవు. అటువంటి ప్రాంతంలో బాధిత మహిళను క్వారంటైన్‌లో ఉంచారు. హైస్కూల్‌లో ఆమె ఒక్కే ఒక్క రోగి కావడం విశేషం. దీంతో మహిళ తండ్రి సుధీర్ ఖల్కో ఆందోళన చెందాడు. కుమార్తెకు రక్షణగా ఉండేందుకు నైట్‌వాచ్‌మన్‌గా మారాడు. రాత్రంతా స్కూలు బయట కూర్చుని కాపలా కాస్తున్నాడు. మహిళ ఉంటున్న క్వారంటైన్ కేంద్రంలో కనీసం ఆహార సదుపాయాలు కల్పించలేకపోయారు అధికారులు. దీంతో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి నుంచి ఆమె తండ్రి ఖల్కో ఆహారం తెచ్చి అందిస్తున్నాడు.
తాను ఈ నెల 11 నుంచి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్నానని, రాత్రుళ్లు సెక్యూరిటీ గార్డు కూడా లేడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం సమయంలో ఇద్దరు మహిళా సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు చేసి వెళ్తారని.. రాత్రి సమయంలో తనకు కాపలాగా తన తండ్రే కాపాలా ఉంటున్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ధరమ్‌జైగఢ్ సబ్ డివిజనల్ కలెక్టర్ నంద‌కుమార్ చౌబే స్పందించారు. ఆ క్వారంటైన్ కేంద్రంలో సెక్యూరిటీ సహా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Tags