తన గన్ మ్యాన్ పెళ్లి సందర్భంగా ఎంపీ సంతోష్ ఎలా విషెస్ తెలిపారో చూడండి..

తమ వద్ద పనిచేసే సిబ్బంది వివాహ వేడుకలకు, ఇతరత్రా ఫంక్షన్లకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులో ఈ కల్చర్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా కారణంగా పెళ్లిళ్లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకే ముహూర్తాలు పెట్టకున్నవాళ్లు 200 మంది అతిథుల మధ్యే పెళ్లిళ్లు చేసుకోవాలని తెలిపింది. ఈ తరహా వివాహాలకు కూడా మార్చి 31వరకే అనుమతి […]

తన గన్ మ్యాన్ పెళ్లి సందర్భంగా ఎంపీ సంతోష్ ఎలా విషెస్ తెలిపారో చూడండి..
Follow us

|

Updated on: Mar 20, 2020 | 9:07 PM

తమ వద్ద పనిచేసే సిబ్బంది వివాహ వేడుకలకు, ఇతరత్రా ఫంక్షన్లకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులో ఈ కల్చర్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా కారణంగా పెళ్లిళ్లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకే ముహూర్తాలు పెట్టకున్నవాళ్లు 200 మంది అతిథుల మధ్యే పెళ్లిళ్లు చేసుకోవాలని తెలిపింది. ఈ తరహా వివాహాలకు కూడా మార్చి 31వరకే అనుమతి ఉంది.

దీంతో ఆల్రెడీ ముందుగానే ముహూర్తం ఫిక్స్ చేసుకున్న టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గన్ మ్యాన్ నరేందర్ గౌడ్ కూడా అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జీవిత భాగస్వామితో ఏడడుగులు వేశారు. ఎంపీ సంతోష్ కుమార్..ఆ జంటకు వీడియో కాల్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా..భువనగిరి సిటీలోని వైఎస్‌ఆర్ గార్డెన్‌లో  నరేందర్ గౌడ్- ఉమారాణి పెళ్లి శుక్రవారం జరిగింది. తన గన్‌మెన్ లైఫ్‌లో కీలక ఘట్టం కావడంతో ఎంపీ సంతోష్ వ్యక్తిగతంగా అతడి వివాహానికి హాజరై ఆశీస్సులు అందించాలని భావించారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో..నరేందర్ దంపుతులకు వీడియో కాల్ చేసి విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీ ట్వీట్ చేయగా…”బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి..సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్