మిర్చి రైతు కంట్లో కారం కొట్టిన క‌రోనా..

ఈ ఏడాది మిర్చి ధరలు రికార్డులు సృష్టించాయి. ఆ ధరలు చూసి తెగ ఆనందపడ్డ అన్నదాతల కంట్లో కరోనా కారం కొట్టింది. పంట చేతికి వచ్చింది.. కానీ అమ్ముకోలేని పరిస్థితి. మార్కెట్ యార్డులు మూతపడడంతో ఎర్ర బంగారం రైతులు తలలు పట్టుకున్నారు. మ‌రోవైపు రెండో విడ‌త మిర‌ప కోత‌కు కూలీలు క‌రువయ్యారు. ప్ర‌భుత్వాలు వ్య‌వ‌సాయ ప‌నుల‌కు అనుమ‌త‌లు ఇస్తున్నా కూలీలు క‌రోనా భ‌యంతో జంకుతున్నారు. ఇంకొన్ని చోట్ల పోలీసులు హ‌డావిడి ఎక్కువైంది. మొద‌టి విడుత కాయ‌ల‌న్నీ కోల్డు […]

మిర్చి రైతు కంట్లో కారం కొట్టిన క‌రోనా..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 2:47 PM

ఈ ఏడాది మిర్చి ధరలు రికార్డులు సృష్టించాయి. ఆ ధరలు చూసి తెగ ఆనందపడ్డ అన్నదాతల కంట్లో కరోనా కారం కొట్టింది. పంట చేతికి వచ్చింది.. కానీ అమ్ముకోలేని పరిస్థితి. మార్కెట్ యార్డులు మూతపడడంతో ఎర్ర బంగారం రైతులు తలలు పట్టుకున్నారు. మ‌రోవైపు రెండో విడ‌త మిర‌ప కోత‌కు కూలీలు క‌రువయ్యారు. ప్ర‌భుత్వాలు వ్య‌వ‌సాయ ప‌నుల‌కు అనుమ‌త‌లు ఇస్తున్నా కూలీలు క‌రోనా భ‌యంతో జంకుతున్నారు. ఇంకొన్ని చోట్ల పోలీసులు హ‌డావిడి ఎక్కువైంది. మొద‌టి విడుత కాయ‌ల‌న్నీ కోల్డు స్టోరేజీల‌కు త‌ర‌లించ‌డంతో..అవి కూడా పూర్తిగా నిండిపోయాయి. డ‌బ్బు ప్లో ఆగిపోవ‌డం, ట్రాన్స్ పోర్టేష‌న్ త‌దిత‌ర ఇబ్బందులు వ‌ల్ల వ్యాపారులు అయితే అస‌లు కాయ కొన‌డానికి ఆసక్తి చూప‌డం లేదు. ఇలా మిర్చి రైతు ప‌రిస్థితి అగమ్య‌గోచరంగా త‌యారైంది. ప్రభుత్వాలే త‌మ‌కేదైనా దారి చూపాల‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.