టోక్యో ఒలంపిక్స్‌ నుంచి కెనడా ఔట్..

ప్రపంచాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ రాకాసి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృతి చెందారు. ఇండియా సహా పలు దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ ప్రభావం దేశంలోని ప్రతి రంగంపై పడింది. అందులో క్రీడలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ క్రీడా టోర్నీలలో కొన్ని రద్దవ్వగా..మరికొన్ని వాయిదాపడ్డాయి. కొందరు ప్లేయర్లు కూడా కరోనాబారిన పడ్డారు. కోవిడ్19 ప్రభావం రోజురోజుకు ముదురుతోన్న నేపథ్యంలో ఈ సారి ఒలంపిక్స్ జరుగుతాయా? […]

టోక్యో ఒలంపిక్స్‌ నుంచి కెనడా ఔట్..
Follow us

|

Updated on: Mar 23, 2020 | 3:19 PM

ప్రపంచాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ రాకాసి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృతి చెందారు. ఇండియా సహా పలు దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ ప్రభావం దేశంలోని ప్రతి రంగంపై పడింది. అందులో క్రీడలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ క్రీడా టోర్నీలలో కొన్ని రద్దవ్వగా..మరికొన్ని వాయిదాపడ్డాయి. కొందరు ప్లేయర్లు కూడా కరోనాబారిన పడ్డారు. కోవిడ్19 ప్రభావం రోజురోజుకు ముదురుతోన్న నేపథ్యంలో ఈ సారి ఒలంపిక్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానం తలెత్తుతుంది.

టోక్యో ఒలింపిక్స్ నుంచి కెనడా తప్పుకుంటున్నట్లు  పారాలింపిక్ కమిటీ, కెనడా ఒలింపిక్ కమిటీలు స్పష్టం చేశాయి. గత రెండు, మూడు రోజుల నుంచి ఒలంపిక్స్‌ను వాయిదా వేయాలనే వాదనలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో నిర్వహణ సరికాదంటూ పలు దేశాలు బహిరంగ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒలంపిక్స్‌ను వాయిదా వేయాలని సూచించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికి ఒలంపిక్స్ మాత్రం వాయిదా పడలేదు. మరి తాజా రిక్వెస్ట్‌లపై అంతర్జాతీయ ఒలంపిక్స్ సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.