రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?
కరోనా వైరస్ విజృంభణతో.. దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను..
కరోనా వైరస్ విజృంభణతో.. దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు ఐదు రోజుల పాటు పూర్తిగా వెల్లడించారు. మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించారో ఆమె తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యానికి ఇందులో పెద్ద పీట వేశారు. చివరగా ప్యాకేజీ మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత కేటాయించారో వివరించారు నిర్మల. ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు.
ఆర్బీఐ ఉద్దీపణ ప్యాకేజ్ – రూ.8.01 లక్షల కోట్లు మార్చిలో కేంద్రం ప్యాకేజ్ – రూ. 1.92 లక్షల కోట్లు కరోనా ప్యాకేజ్ 1.0 – రూ. 5.94 లక్షల కోట్లు కరోనా ప్యాకేజ్ 2.0 – రూ. 3.10 లక్షల కోట్లు కరోనా ప్యాకేజ్ 3.0 – రూ. 1.50 లక్షల కోట్లు కరోనా ప్యాకేజ్ 4.0 & 5.0 – రూ. 48,100 కోట్లు మొత్తం ప్యాకేజ్ – రూ.20 లక్షల కోట్లు
రంగం కేటాయింపు(కోట్లలో)
1 | ఎంఎస్ఎంఈల నిర్వహణ మూలధనం | రూ.3,00,000 |
2 | రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలు | రూ.20,000 |
3 | ఎంఎస్ఎంఈల ఫండ్ ఆఫ్ ఫండ్ | రూ.50,000 |
4 | ఈపీఎఫ్ మద్దతు చర్యలు | రూ.2,800 |
5 | ఈపీఎఫ్ రేట్ల తగ్గింపు | రూ.6,750 |
6 | ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలు | రూ.30,000 |
7 | ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు పాక్షిక రుణ హమీలు | రూ.45,000 |
8 | విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక సాయం | రూ.90,000 |
9 | టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు | రూ.50,000 |
10 | వలస కూలీలకు 2 నెలల ఉచిత రేషన్ | రూ.3,500 |
11 | ముద్రా యోజన శిశు రుణాల వడ్డీ రేట్ల సబ్సిడీ | రూ.1,500 |
12 | వీధి వ్యాపారులు | రూ.5,000 |
13 | దిగువ మధ్య తరగతికి చౌక ఇళ్ల పథకం | రూ.70,000 |
14 | నాబార్డ్ ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ | రూ.30,000 |
15 | కేసీసీ ద్వారా అదనపు క్రెడిట్ | రూ.2,00,000 |
16 | మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ | రూ.10,000 |
17 | ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన | రూ.20,000 |
18 | టాప్ టు టోటల్ (ఆపరేషన్ గ్రీన్స్) | రూ.500 |
19 | వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి | రూ.1,00,000 |
20 | పశు సంవర్థక మౌలిక వసతుల కల్పన | రూ.15,000 |
21 | ఔషధ మొక్కల పెంపకం | రూ.4,000 |
22 | తేనెటీగల పెంపకం | రూ.500 |
23 | వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ | రూ.8,100 |
24 | గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా | రూ.40,000 |
Announcements in 4th and 5th tranche total Rs 48,100 crores (4/5)#AatmaNirbharApnaBharat pic.twitter.com/WJiz1aTTyj
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 17, 2020
Read More:
భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..