చిరు ఆధ్వర్యంలో చారిటీ.. కదిలొస్తోన్న టాలీవుడ్..!

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రోజువారి జీతం మీద ఆధారపడే చాలామందికి ఉపాధి లేకుండా పోయింది.

చిరు ఆధ్వర్యంలో చారిటీ.. కదిలొస్తోన్న టాలీవుడ్..!
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 8:40 PM

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రోజువారి జీతం మీద ఆధారపడే చాలామందికి ఉపాధి లేకుండా పోయింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న కార్మికులు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. తెలుగు పరిశ్రమకు పెద్దన్నగా ఉన్న చిరంజీవి ఆలోచనతో ఓ చారిటీని ఏర్పాటు చేశారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇవ్వగా.. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున చారిటీకి ఇచ్చారు.

దీనిపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. చిరంజీవి ఆధర్యంలో తాను, సురేష్ బాబు, ఎన్‌.శంక‌ర్, క‌ల్యాణ్, దాము అంద‌రం క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాటై ‘సీసీసీ’ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. దీనికి నాందిగా మొద‌ట చిరంజీవి గారు కోటి రూపాయ‌లను ప్ర‌క‌టించారు. నాగార్జున గారు కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్ 25ల‌క్ష‌లు ఇలా విరాళాలు ప్ర‌క‌టించారు. వీరే కాకుండా ఎవ‌రైనా సినిమా ప‌రిశ్ర‌మ కార్మికుల‌ను ఆదుకోవ‌చ్చు.. క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతున్న సినీ కార్మికుల సంక్షేమ‌మే ఈ సంస్థ ముఖ్య ఆశ‌యం. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాలి.. అంద‌రం క‌లిస్తేనే కరోనాను, అది తెచ్చిన ఇబ్బందుల‌ను పార‌ద్రోల‌గ‌లం అన్నారు.

ఇక ఈ సంస్థకు మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఉండనుండగా.. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సురేష్ బాబు, సి.కల్యాణ్, దాము, బెన‌ర్జీ, శంకర్ సభ్యులుగా ఉండనున్నారు. డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో భాగ‌స్వాములు కానున్నారు.

Read This Story Also: ఇలాంటి వాటిని ప్రచారం చేయడం ఆపండి: ధోని భార్య ఫైర్‌