చైనాపై అమెరికా మరోసారి ఫైర్

కరోనా వైరస్‌ మహమ్మారిగా మారడానికి కారణమైన చైనాపై అమెరికా మాటల తూటాలను ఆపటం లేదు. తాజాగా ఆ మాటల తూటాలకు మరింత పదును పెట్టింది. సోవియట్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణుప్రమాదంతో కరోనావైరస్‌ను పోలుస్తూ విమర్శలు గుప్పించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో చైనా వ్యవహార తీరు, చెర్నోబిల్‌ దుర్ఘటన సమయంలో సోవియట్‌ తీరులాగే కనిపిస్తోందని తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ విమర్శించారు. కోవిడ్ 19తో ఏం జరుగుతుందన్నది డ్రాగన్‌ కంట్రీకి ముందే తెలిసినప్పటికీ… […]

చైనాపై అమెరికా మరోసారి ఫైర్
Follow us

|

Updated on: May 25, 2020 | 2:50 PM

కరోనా వైరస్‌ మహమ్మారిగా మారడానికి కారణమైన చైనాపై అమెరికా మాటల తూటాలను ఆపటం లేదు. తాజాగా ఆ మాటల తూటాలకు మరింత పదును పెట్టింది. సోవియట్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణుప్రమాదంతో కరోనావైరస్‌ను పోలుస్తూ విమర్శలు గుప్పించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో చైనా వ్యవహార తీరు, చెర్నోబిల్‌ దుర్ఘటన సమయంలో సోవియట్‌ తీరులాగే కనిపిస్తోందని తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ విమర్శించారు. కోవిడ్ 19తో ఏం జరుగుతుందన్నది డ్రాగన్‌ కంట్రీకి ముందే తెలిసినప్పటికీ… ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ నాశనానికి కారణమైన ఈ వైరస్‌ను ప్రపంచం మీదకు చైనా వదిలిపెట్టిందని అన్నారు. వైరస్‌ విజృంభణ సమయంలో వాస్తవ సమాచారాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చైనా దాచిపెట్టిందన్నారు. ఈ చర్యతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఓబ్రియన్‌ దుయ్యబట్టారు.