కరోనా వైరస్‌: చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం!

చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2000 మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా.. 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో చైనా ప్రభుత్వం మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో దేశవ్యాప్తంగా వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ బ్యూరో సంయుక్త ప్రకటనలో తెలిపింది. వన్యప్రాణుల అభివృద్ధి కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉండాలని, వన్యప్రాణుల రవాణాను నిషేధించాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి […]

కరోనా వైరస్‌: చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం!
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 8:55 PM

చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2000 మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా.. 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో చైనా ప్రభుత్వం మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో దేశవ్యాప్తంగా వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ బ్యూరో సంయుక్త ప్రకటనలో తెలిపింది. వన్యప్రాణుల అభివృద్ధి కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉండాలని, వన్యప్రాణుల రవాణాను నిషేధించాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది.

కరోనా వైరస్‌ బాధితులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు 1000 పడకల ఆస్పత్రిని కేవలం 10 రోజుల్లోనే నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ పనులు ఊపందుకున్నాయి. దీనికి అనుబంధంగా మరో 1500 పడకల ఆస్పత్రిని నిర్మించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఈ వైరస్‌ వ్యాప్తికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు, నివారణ చర్యల కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.