మిర్చి పంట పండినా..కరోనా కాటేసింది..

పంట పండింది. మిర్చి రేటు దాదాపు రూ. 20 వేలు తాకింది. రైతులు ముఖాల్లో ఆనందాలు విరిశాయి. ఇప్పటివరకు చేసిన అప్పులకు వడ్డీ కట్టేయెచ్చు అనుకున్నారు కొందరు రైతులు. బ్యాంకుల్లో ఉన్న బంగారం..తమ ఇల్లాళ్ల మెడలోకి తిరిగి వస్తుందని ఆశపడ్డారు. మరికొందరు ఆడపిల్లల పెళ్లిల్లు ఈ ఏడాది చేసుకోవచ్చు అని నిబ్బరంగా ఉన్నారు. కానీ తాలు(తెగులు వచ్చిన కాయలు) రూపంలో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని విధంగా కోసిన కాయలో 50 శాతం తాలు వస్తుండటం రైతులకు […]

మిర్చి పంట పండినా..కరోనా కాటేసింది..
Follow us

|

Updated on: Feb 08, 2020 | 7:41 PM

పంట పండింది. మిర్చి రేటు దాదాపు రూ. 20 వేలు తాకింది. రైతులు ముఖాల్లో ఆనందాలు విరిశాయి. ఇప్పటివరకు చేసిన అప్పులకు వడ్డీ కట్టేయెచ్చు అనుకున్నారు కొందరు రైతులు. బ్యాంకుల్లో ఉన్న బంగారం..తమ ఇల్లాళ్ల మెడలోకి తిరిగి వస్తుందని ఆశపడ్డారు. మరికొందరు ఆడపిల్లల పెళ్లిల్లు ఈ ఏడాది చేసుకోవచ్చు అని నిబ్బరంగా ఉన్నారు. కానీ తాలు(తెగులు వచ్చిన కాయలు) రూపంలో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని విధంగా కోసిన కాయలో 50 శాతం తాలు వస్తుండటం రైతులకు విస్మయానికి గురి చేసింది. అయినా పర్లేదు ఈ ఏడాది నష్టం మాత్రం రాదు అనుకున్నారు రైతులు.

కానీ ఇక్కడే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిర్చి రైతులుకు శాపంలా మారింది. ఎగుమతులు ఆగిపోవడంతో ధర అనూహ్యంగా పడిపోయింది.  కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు ప్రాణసంకటంగా మారిందని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు  గురువారం రాజ్యసభలో సభలో లేవనెత్తారు. 5,000 టన్నుల తేజా రకం చిల్లీతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అని, అందులో 60 శాతం చైనా ఏటా దిగుమతి చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మిరప రైతులకు పారితోషికం ధరలు ఉండేలా చూడాలని, పరిస్థితి మెరుగుపడే వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రిఫ్రిజిరేషన్, సేఫ్ కీపింగ్ కింద నిల్వ సదుపాయాన్ని కల్పించాలని కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఎగుమతులకు పరిస్థితి మెరుగుపడే వరకు వారి పంటలకు బీమా సౌకర్యాన్ని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన  రాజ్యసభ చైర్‌పర్సన్ ఎం. వెంకయ్య నాయుడు, మిరప ధరలు తిరోగమనంలో ఉన్నట్లు అంగీకరిస్తూ, ధరలను ప్రభావితం చేసే కరోనావైరస్ గురించి వాస్తవాలను తనిఖీ చేయమని రామచంద్రరావును కోరారు.