మహమ్మారి దెబ్బకు.. తల్లడిల్లుతున్న ప్రపంచ దేశాలు..
కంటికి కనిపించని ఆ సూక్ష్మ వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తున్నాయి. దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారు.. కనీసం సొంత కుటుంబీకుల కడచూపును కూడా నోచుకోలేకపోతున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. దేశాల ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. వీరిలో పదహారు […]
కంటికి కనిపించని ఆ సూక్ష్మ వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తున్నాయి. దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారు.. కనీసం సొంత కుటుంబీకుల కడచూపును కూడా నోచుకోలేకపోతున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. దేశాల ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. వీరిలో పదహారు లక్షల మందికి పైగా కోలుకోగా.. దాదాపు మూడు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,42,354కి చేరింది. ఇక కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారు..2,92,883 కాగా.. ఈ మహమ్మారి నుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,02,443.
ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 14 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. 83 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలలో లక్షల్లో కేసులు నమోదయ్యాయి.