పాకిస్తాన్‌లో కరోనా మరణ మృదంగం

Coronavirus cases soar to 217809 while, పాకిస్తాన్‌లో కరోనా మరణ మృదంగం

పాకిస్తాన్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం పాకిస్తానీయుల ప్రాణాలమీదికి వస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేయడంతోనే కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లోంచి వేల సంఖ్యలోకి మారింది. గురువారం ఒక్కరోజే 4,439కేసులు నమోదైనట్లుగా అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,17,809కి చేరింది. ఇదిలావుంటే కరోనా మహమ్మారికి బలవుతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 78 మంది చనిపోయినట్లుగా పాకిస్తాన్ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్  బులిటెన్ లో పేర్కొంది.

ఇక అత్యధిక కరోనా కేసులు సింధ్ ప్రావిన్స్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లుగా తేలింది. ఇప్పటివరకు ఇక్కడ ఒక్కచోటే దాదాపు 87 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ 77వేల740 కేసులు బయటపడ్డాయి.

ఒక్కసారిగా కరోనా విజృంభిస్తుండటంతో స్మార్ట్ లాక్ డౌన్ పేరుతో లాక్ డౌన్ ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చింది అక్కడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *